అంతర్జాతీయస్థాయిలో తెంగాణకు గుర్తింపు
తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ (టీఎంఆర్) పాఠశాలల్లో చదివిన విద్యార్థులు అంతర్జాతీయస్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చారని టెమ్రీస్ కార్యదర్శి బీ షఫీఉల్లా పేర్కొన్నారు. ఇది రాష్ట్రం గర్వించే క్షణమని చెప్పారు. అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు పదిరోజుల కిందట వెళ్లిన టీఎంఆర్ స్కూళ్లకు చెందిన ఆరుగురు విద్యార్థులు అధికారులు తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ బృందం వెంటన వెళ్లిన షఫీఉల్లా శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం వల్లే అంతర్జాతీయ వేదికపై విద్యార్థులు అభినందనలు అందుకున్నారని తెలిపారు. టీఎంఆర్ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన టెమ్రిస్ ప్యూజన్ ఎల్-5 స్పేస్ ప్రాజెక్టును అమెరికా లాస్ఏంజిల్స్లో జరిగిన అంతర్జాతీయ స్పేస్ డెవలప్మెంట్ సదస్సులో ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు వివిధ దేశాల శాస్త్రవేత్తలు అభినందించారు. తర్వాత విద్యార్థులు కాలిఫోర్నియా సైన్స్ సెంటర్కు, స్పేస్ సెంటర్కు వెళ్లారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న నాసాకు చెందిన ఎంఎస్ పరిశోధన కేంద్రాన్ని ప్రఖ్యాత స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీకి సందర్శించారు అని వివరించారు. అతి తక్కువ సమయంలో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టుకు అంతర్జాతీయ సదస్సులో ప్రశంసలు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు అమెరికాకు వెళ్లేందుకు సహకరించిన ముఖ్యమంత్రికి, అధికారులకు షఫీఉల్లా కృతజ్ఞతలు తెలిపారు.













