ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం.. సీఎం రేవంత్ కు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ విషయంలో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. లీక్ రాయుళ్ల ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయన దగ్గరి పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పోలీసు సెక్యూరిటీ సిబ్బందిని ఇంటెలిజెన్స్ మార్చింది. కేసీఆర్ వద్ద పనిచేసిన ఏ ఒక్క సెక్యూరిటీ సిబ్బంది, అధికారిని ఉంచొద్దని ఇంటెలిజెన్స్ నిర్ణయించింది. సీఎం రేవంత్‌కు సంబంధించిన సమాచారం లీక్ అవుతోందని సెక్యూరిటీ సిబ్బంది, అధికారులను ఇంటెలిజెన్స్ మార్చినట్లు తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత వివిధ శాఖల చీఫ్‌లను మార్చిన విషయం తెలిసిందే. తాజాగా సెక్యూరిటీ మొత్తాన్ని మార్చాలని సీఎంవోను ఐబీ ఆదేశించింది. సెక్యూరిటీ మార్పునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.













