ఫిలింనగర్ వినాయకుడికి తాపేశ్వరం లడ్డూ ఎంతో తెలుసా?
హైదరాబాద్ ఫిలింనగర్ సన్నిధిలోని వినాయకుడికి ఈ ఏడాది 500 కిలోల లడ్డూప్రసాదాన్ని అందజేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి స్వీట్స్ సంస్థ యాజమాని పొలిశెట్టి మల్లికార్జునరావు (మల్లిబాబు) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భవన్ వద్ద ఉన్న పూరీజగన్నాథ్ స్వామి ఆలయానికి కూడా 100 కిలోల లడ్డూను ఇస్తున్నామన్నారు. లడ్డూ తయారీ ఈ నెల 22న ప్రారంభించి 24న తాపేశ్వరం నుంచి ఫిలింనగర్‌కు తరలిస్తామన్నారు. అమెరికాలోని వర్జీనియాలో వినాయక పూజలకు సంబంధించి అక్కడ తయారు చేసే లడ్డూకు తమ సిబ్బంది సహకరిస్తారని తెలిపారు.













