హైటెక్ రాష్ట్రంలో ఇదేం విధానం : హైకోర్టు
వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేయూ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2021లో ఖానామెంట్లో రాష్ట్ర ప్రభుత్వం కమ్మ, వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున కేటాయించిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. కులాల వారీగా భూములు కేటాయించడమేంటని ఉన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కులాల వారీగా భూములు కేటాయించడం ఆర్టికల్ 14కి విరుద్ధమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తీరు సమాజంలో కుల విభజనకు దారి తీసేలా ఉంది. 21వ శతాబ్దంలో హైటెక్ రాష్ట్రంలో ఇదే విధానం. కులాల వారీగా భూ కేటాయింపులు అసంబద్ధం, తప్పు అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలకు మాత్రమే భూములు ఇవ్వాలని, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వంటి విధానాలు ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇరుకైన ఆలోచనలు వీడి, విశాలంగా ఆలోచించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. .













