కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సదస్సు నుంచి ఆహ్వానం!
మరో అంతర్జాతీయ సదస్సుకు హాజరవ్వాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి 15 వరకు జర్మనీ వేదికగా జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ – 2023 సమావేశంలో పాల్గొనాలని కేటీఆర్‌కు ఆహ్వానం దక్కింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ‘కనెక్టింగ్ స్టార్టప్ ఎకో సిస్టం’ అనే అంశంపై చర్చ జరగనుంది. జర్మనీ సెనేట్‌లోని ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి హాజరవ్వాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం పంపిన ప్రతినిధులు.. ఇక్కడ ప్రసంగించాలని ఆహ్వాన పత్రికలో కేటీఆర్‌ను కోరారు.
ఈ సదస్సులో మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్ టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ప్రధానమైన అంశాలపై విస్తృత చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన సెషన్ ఉంటుందని, అద్భుతమైన ఆలోచనలున్న స్టార్టప్ కంపెనీలు ఈ అవకాశాన్ని సద్వినియోం చేసుకోవచ్చని తెలిపింది. ఇంతకుముందే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుకావాలని కూడా కేటీఆర్ ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.













