ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన తెలంగాణ సీనియర్ నాయకురాలు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ ఢిల్లీ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ (అప్)లో చేరారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాగారు ప్రాథమిక సభ్యత్వంంతో పాటు పార్టీ కండువా కప్పి సాదరణంగా ఆహ్వానించారు. అనంతరం సౌత్ ఇండియా ఇన్ చార్జీ సోమ్ నాథ్ భారతి, ఇందిరాశోభన్తో కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాశోభన్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సౌత్ ఇండియా ఇన్ చార్జీ సోమ్ నాథ్ భారతిలకు ఇందిరాశోభన్ కృతజ్ఞతలు తెలిపారు.













