తెలంగాణ అమ్మయికి గూగుల్ ఉద్యోగం
ఆ చదువుల తల్లికి లక్ష్మీ కటాక్షం లభించింది. ఆమె ప్రతిభను గూగుల్ మెచ్చింది. రూ.12 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం కల్పించింది. ఆమే తెలంగాణ అమ్మయి కుడుగుంట స్నేహారెడ్డి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేచురల్ ల్యాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనే అంశంపై పరిశోధనలు చేస్తున్న గూగుల్ సంస్థ, ఈ ప్రాజెక్టులో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించి, దేశవ్యాప్తంగా ఐదుగురిని ఎంపిక చేసింది. వీరిలో స్నేహారెడ్డి ఒకరు. మిగతా నలుగురు పీహెచ్డీలు పూర్తి చేసినవారు కాగా, స్నేహారెడ్డి ఒక్కరే బీటెక్తోనే ఈ అవకాశం అందిపుచ్చుకోవడం విశేషం. స్నేహారెడ్డి స్వస్థలం వికారాబాద్. హైదరాబాద్ ఐఐటి (కంది-సంగారెడ్డి)లో ఆమె బీటెక్ పూర్తి చేశారు. తొలుత గూగుల్ సంస్థ నిర్వహించిన నాలుగు రౌండ్ల ఆన్ లైన్ ఇంటర్వ్యూను స్నేహారెడ్డి పూర్తి చేశారు. స్నేహ ప్రతిభను గుర్తించిన గూగుల్ ప్రతినిధులు ఆమెకు ఐదో రౌండ్ పరీక్షనూ ఆన్లైన్లోనే నిర్వహించారు.













