తెలంగాణలో మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల ఫైన్.. .ఉత్తర్వులు జారీ
తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించుకుంది. కరోనా కట్టడికి ప్రజలందరూ విధిగా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని ఇప్పటి వరకూ సుతిమెత్తగా చెబుతూ వస్తోంది.ఇకపై మాస్క్ ధరించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించని వారికి 1000 రూపాయలు జరిమానా విధించాలని డీజీపీ, జిల్లా కలెక్టర్లకు సూచించింది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ప్రజా రవాణా, కార్యాయాలు తదితర ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి అని, ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













