మనం సీఎం ఒక్కసారి పీఎం అయితే… దేశచరిత్రే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒక్కసారి ప్రధానమంత్రిని చేస్తే దేశంలో సమస్యలే ఉండవని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. జాతీయ పార్టీలుగా చెప్పుకొనే కొన్ని పార్టీలు ఎప్పుడో తీసుకొచ్చిన కాలం చెల్లిన పథకాలను ఇప్పటికే చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒక్కసారి పీఎంను చేయాలి. మనం సీఎం ఒక్కసారి పీఎం అయితే భారతదేశ చరిత్రే మారిపోతుందని అన్నారు. సీఎం కేసీఆర్ గత ఏడేండ్లలో తెలంగాణలో అందరికి వైద్యం అందించి దేశంలోనే చరిత్ర సృష్టించాడు. అందుకే దేశప్రజలకు ఒక మెసెజ్ ఇవ్వాలని అన్నారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్తో పాటు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తోందని విమర్శించారు













