టీఆర్ఎస్ చెబితే.. బీజేపీ అడిగితే వచ్చినవాళ్లం కాదు
టీఆర్ఎస్ చెబితే వచ్చినవాళ్లం కాదని, బీజేపీ అడిగితే వచ్చినవాళ్లం కాదని వైఎస్ షర్మిల అన్నారు. పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల కసరత్తు ముమ్మరం చేశారు. పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సంకల్ప సభ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని, తాను ముఖ్యమంత్రినని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని దేవుడు ఉన్నాడని అన్నారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు. పాదయాత్ర మొదలు పెట్టిన ఏప్రిల్ 9న తొలి అడుగు వేద్దామని అన్నారు.













