సీఎం కేసీఆర్ సభ ఆపాలన్న.. పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భాగాంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార సభ నిర్వహించకుండా ఆపాలన్న పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టి తేల్చేందుకు హైకోర్టు నిరాకరించింది. స్వతంత్ర అభ్యర్థి సైదయ్యతో పాటు మరికొందరు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి వద్ద విచారణకు వచ్చాయి. సంబంధిత బెంచ్‌కు పిటిషన్లను పంపించాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా ఈ నెల 14న అనుములలో టీఆర్ఎస్ భారీ సభకు ఏర్పాట్లు చేస్తోందని, సభను ఆపాలని పిటిషనర్లు పేర్కొన్నారు.













