ప్రవాస భారతీయుల సమస్యలను సీఎం దృష్టికి
ప్రపంచదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను గుర్తించాలని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, కార్మిక శాఖ తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ భేటీ అయ్యారు. ప్రవాసుల సమస్యలను తీర్చడానికై అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సోమేష్ కుమార్ కోరారు. ఈ సలహాలు, సూచనలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్నారై అఫైర్స్ మినిస్టర్ కేటీఆర్కు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రవాసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సోమేష్ కుమార్ చెప్పారు.













