ICFAI నుంచి శ్రీమతి శోభ యశస్వి 2 కోట్ల రూపాయల విరాళం
3 దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ICFAI (Institute of Chartered and Financial Analysts of India) అంటే తెలియని వారు లేరు. చిన్నతనం లొనే దేశ వ్యాప్తం గా పేరు తెచ్చుకున్న శ్రీ N J యశస్వి స్థాపించిన సంస్థ అది. అతి తక్కువ కాలం లోనే దేశం లో అనేక రాష్టాలలో ICFAI Schools, Business schools, Law colleges, Universities వచ్చాయి.
ఎంతో మంది కి ఆదర్శం గా నిలిచిన మన తెలుగు వ్యక్తి శ్రీ యశస్వి చిన్న వయస్సు లోనే స్వర్గస్తులయ్యారు. ఆయన ప్రారంభించిన సంస్థ ను ఆయన సతీమణి శ్రీమతి శోభ, కుమారుడు తేజస్వి, కుమార్తె వెన్నెల, ఇతర కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ ఎంతో మంది కి ఉపాధి, యువత కు విద్య ను ఇస్తున్నారు.
కరోనా సంక్షోభ సమయం లో ICFAI తరుపున, సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి శోభ యశస్వి ప్రధాన మంత్రి సంక్షేమ నిధి కి 1 కోటి రూపాయలు, తెలంగాణ ముఖ్యమంత్రి నిధి కి 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు.
శ్రీమతి శోభ తెలంగాణ ప్రభుత్వ ఐ టీ శాఖ మంత్రి శ్రీ కె టీ రామారావు ని కలిసి 1 కోటి రూపాయల చెక్ ని ఇచ్చి కరోనా విపత్తు ని ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.













