తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు కూడా ఇచ్చింది. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నారు.1990 బ్యాచ్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అదేవిధంగా యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్, అయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా పాట్రు గౌతమ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మంద మకరందు, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ముజమిల్ ఖాన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా కె.హరితను నియమించారు.













