త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదలీలు!
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు పెద్ద ఎత్తున జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ దిశగా ఇప్పటికే కొంత కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల కలెక్టర్లు సహా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని, అదనపు బాధ్యతల్లో ఉన్న పలు పోస్టులకు పూర్తి స్థాయిలో అధికారులను నియమించే అవకాశముందని తెలుస్తోంది. ఐపీఎస్ అధికారుల్లో ఎస్పీలు, కమిషనర్లు, సీనియర్ అధికారులను స్థాన చలనం ఉంటుందని తెలుస్తోంది. సర్కారుకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతాయని ప్రభుత్వ వర్లాల్లో చర్చ జరుగుతోంది.













