ఎన్నారైలతో పీసీసీ అధ్యక్షుడు వీడియో కాన్ఫరెన్స్
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దుబాయి తదితర దేశాల్లోని ఎన్నారైలతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పలువురు ఎన్నారైలు త్వరితగతిన స్వదేశానికి రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రయాణంలో రాయితీ కల్పించాలని స్వదేశానికి వచ్చాక క్వారంటైన్ ఛార్జీలు వసూలు చేయకుండా చూడాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈదురుగాలులకు టోల్గేట్ షెడ్ విరిగి పడి కౌలు రైతు దంపతులు మృతి చెందడం పట్ల ఉత్తమ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.













