4 ఐ-తెలంగాణ 2017 సదస్సు
ఐ-తెలంగాణ 2017 సదస్సును హెచ్ఐసీసీలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీలను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సైయెంట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఫిక్కీ సెక్రటరీ జనరల్ సంజయ్ బారు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇదే ప్రాంగణంలో టీ- ఎయిర్ సమ్మిట్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. టీ ఎయిర్ సమ్మిట్ మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ఇంటర్నెట్, రోబోటిక్స్‌పై చర్చించనున్నారు.
సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి : కేటీఆర్
రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీ సెక్టార్లో విజయవంతంగా 10 కొత్త పాలసీలను తీసుకువచ్చామని తెలిపారు. గ్లోబల్ టెక్నాలజీ, ఆపిల్, గూగుల్ లాంటి సంస్థలను హైదరాబాద్‌కు తీసుకువచ్చామన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కొత్త టెక్నాలజీలను అమలు పర్చడంలో ముందుంది అని పేర్కొన్నారు. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేటీఆర్ స్ఫష్టం చేశారు.













