రేవంత్‌రెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. గురువారం రాత్రి 7 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున 2:30 గంటల వరకు సోదాలు కొనసాగాయి. రేవంత్‌ను దాదాపు 31 గంటల పాటు ఐటీ అధికారులు విచారించారు. 150 ప్రశ్నలకు రేవంత్ నుంచి లిఖితపూర్వక సమాధానాలు రాయించుకున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, ప్రింటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెక్కలు చూపని ఆస్తులు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అక్టోబర్ 3న విచారణకు రావాలని రేవంత్‌కు నోటీసులు జారీ చేశారు.













