నైట్-హెన్నెస్సీ స్కాలర్ షిప్ కు … రాహుల్ పెనుమాక ఎంపిక

ప్రఖ్యాత నైట్-హెన్నెస్సీ స్కాలర్‌షిప్‌కు హైదరాబాద్ చెందిన రాహుల్ పెనుమాక ఎంపికయ్యారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారికి స్టాన్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయంలోని మొత్తం ఏడు స్కూల్స్‌లో బహుముఖ అవకాశాలు ఇస్తారు. దీని ద్వారా మూడు సంవత్సరాల పాటు ఉపకార వేతనం అందిస్తారు. రాహుల్ పెనుమాక ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ట్రాన్స్‌లేషన్ రిసెర్చ్, అప్లైడ్ మెడిసిన్‌లో మాస్టర్స్ చేస్తున్నారు. లండన్ ఇంపీరియల్ కళాశాల నుంచి ఆయన ఫార్మకాలజీ (ఔషధ శాస్త్రం)లో డిగ్రీ పట్టా పొందారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కుమారుడైన రాహుల్ పెనుమాక వైద్య రంగంలో పలు అధ్యయనాలు చేశారు.