8న చేప ప్రసాదం పంపిణి

మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు జూన్ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బత్తిని అమర్నాథ్‌గౌడ్ మాట్లాడుతూ 24 గంటల పాటు పంపిణీ ఉంటుందని తెలిపారు. అనంతరం రెండు రోజుల పాటు దూద్‌బౌలిలోని తమ నివాసంలో కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఇందుకు మూడు లక్షల చేప పిల్లలను సిద్ధం చేయాలని మత్స్యశాఖకు లిఖిత పూర్వకంగా తెలియజేశామన్నారు.