గూగుల్ పేలో రూ.లక్ష రివార్డు
గూగుల్ పేలో డబ్బులు పంపినపుడు, తీసుకున్నప్పుడు వచ్చే స్క్రాచ్ కార్డులు ఎంత ఆశ పుట్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంత మందికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుంది. హైదరాబాద్‌కు చెందిన సందీప్ కుమార్ అనే యువకుడికి కరోనా కష్టకాలంలో గూగుల్‌పేలో ఏకంగా రూ.లక్ష రివార్డు దక్కింది. మొదట్లో అమనకే మొస్తుందిలే ఐదారు రూపాయలు అంతే కదా అని పెద్దగా ఆశపడకుండా కార్డును స్క్రాచ్ చేయగా రూ.లక్ష అని తేలింది. స్క్రాచ్ చేయగా వచ్చిన మొత్తాన్ని చూసి ముందు నమ్మని సందీప్‌కుమార్ తర్వాత తన ఖాతాను చెక్ చేసుకుని ఎగిరి గంతేశాడు. తన స్నేహితుడికి డబ్బు అవసరం కాగా సందీప్ రూ.2 వేలను గూగుల్ పే ద్వారా పంపాడు. ఆ పేమెంట్‌కు వచ్చిన స్క్రాచ్ కార్డు అతనికి రూ.లక్ష తెచ్చి పెట్టింది. తన కుమారుడి పేరున బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని సందీప్ చెప్పాడు. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తికి రూ.1,00,107 తగిలిన విషయం తెలిసిందే.













