టీఆర్ఎస్ ప్లీనరీ పనులు ప్రారంభం
ఈ నెల 27న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ పనులు కొంపల్లిలో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేదిక నిర్మాణం, ప్రాంగణ ఏర్పాట్లకు భూమి పూజ చేశారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ట్రాఫిక్, వాహనాల పార్కింగు అంశాలపై అధికారులతో చర్చించారు. కార్యకర్తల నమోదు, భోజన శాల పనులను పరిశీలించారు. రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కనకారెడ్డి, వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజులతో కలిసి ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఈ నెల 24 నాటికే పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.













