హైదరాబాద్ లో వరల్డ్ జియో స్పేషియల్ కాంగ్రెస్
హైదరాబాద్ కేంద్రంగా వచ్చే ఏడాది అక్టోబరులో రెండో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (యూఎన్డబ్ల్యుజీఐసీ) నిర్వహించనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రకటించింది. యునైటెడ్ నేషన్స్ నిపుణుల కమిటీ నాలుగేళ్లకోసారి దీన్ని ఏర్పాటు చేస్తుంది. భౌగోళిక ప్రాదేశిక (జియో స్పేషియల్) సమాచార నిర్వహణలో భాగస్వామ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొదించడమే దీని లక్ష్యం. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి అశుతోష్ శర్మ ఈ అంశంపై భౌగోళిక ప్రాదేశిక సమాచార విభాగం ప్రతినిధులతో మాట్లాడారు. స్వామిత్య పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూమి హక్కులకు డిజిటల్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ సదస్సులో పాల్గొనేందుకు జియో స్పేషియల్ రంగంలోని వివిధ దేశాలకు చెందిన ప్రపంచస్థాయి నిపుణులు, భాగస్వాములు, శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. టువార్డస్ జియో ఎనేబ్లిండ్ ద గ్లోబల్ విలేజ్ నినాదంతో నిర్వహించే ఈ సదస్సులో జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్, టెకాల్నజీ, ఎదురువుతున్న సవాళ్లు, సమస్యలు, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి, తీర్మానాలు చేయనున్నారు. సదస్సు నిర్వహణ ద్వారా సంబంధిత స్టేక్ హోల్డర్స్ని వివిధ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం సాధ్యమవుతున్నది. తొలి యూఎన్డబ్యుజీఐసీ 2018, అక్టోబరులో చైనాలో జరిగింది.













