హైదరాబాద్ లో మరో జాతీయ సదస్సు
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద మార్కెటింగ్, టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఎలివేట్ ఎక్స్పోను ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజుల పాటు ఈథోస్ ఇమాజినేషన్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబందించిన పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నిర్వహిస్తున్న ఎలివేట్ ఎక్స్‌పోలో వ్యాపార రంగంలో ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చించుకోవడంతో పాటు నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకునేందుకు ఈ సమ్మిట్ వేదికగా నిలుస్తున్నదన్నారు. వ్యాపార ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో కీలకంగా మారిందని, ముఖ్యంగా నిపుణులతో మార్కెటింగ్‌కు సంబంధించిన మెలుకువలు తెలుసుకునేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రదర్శనగా నిలువనున్నదని వ్యాఖ్యానించారు.













