ఆకాశంలో అద్భుతం.. సూర్యుని చుట్టూ

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు మాదిరిగా ఓ వలయం కనిపించింది. ఉదయం 10 గంటల నుంచి ఇలా కనిపిస్తోందని కొందరు స్థానికులు చెప్పారు. ఈ సుందర దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధించుకున్నారు. హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా, సహా పలు ప్రాంతాల్లో సూర్యుడి చుట్టూ వలయం స్పష్టంగా కనిపించింది. దట్టమైన మేఘాలు ఏర్పడి వాటిలో ఘనీభవించిన నీటి బిందువులపై సూర్యకిరణాలు పడినపుడు ఇలాంటి దృశ్యం ఆవిష్క•తమవుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మంచు బిందువులపై పడిన కిరణాలు పరావర్తనం చెంది ఇలా ఇంధ్ర ధనస్సు రంగుల్లో కనిపిస్తాయని తెలిపారు. సాధారణ పరిభాషలో దీన్ని వరద గూడు అని అంటారని, ఇలా ఏర్పడితే ఆ సంవత్సరమంతా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రైతుల నమ్మకం.