హైదరాబాద్ విద్యార్థినికి జాక్‌పాట్ !
హైదరాబాద్‌లో చదువుకున్న షఫకి అహ్మరీన్ అనే విద్యార్థిని జాక్‌పాట్ కొట్టింది. స్థానిక ఇక్ఫాయ్టెక్లో బీటెక్ చేసిన ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విద్యాశాఖలో జూనియర్ రిసెర్చర్‌గా ఎంపికయ్యింది. ఆమె వార్షిక జీతం రూ.36 లక్షలు (1,92,000 దిర్హమ్లు). అహ్మరీన్ ఈ ఏడాదే తన డిగ్రీ పూర్తి చేసుకుంది. ఇక్ఫాయ్ టెక్‌లో ఆమె అడ్వాన్స్డ్ టాపిక్స్‌పై కూడా ప్రత్యేక ప్రాజెక్టు చేసింది. ఇదిలావుండగా, హైదరాబాద్ ఇక్ఫాయ్టెక్లో ఈ ఏడాది బీటెక్ చేసిన మరో ఇద్దరు యువకులు పురాణం కార్తిక్సాయి రాధాకృష్ణ, గడ్డం మణిచంద్రతేజలకు బెంగళూరులోని వెస్ట్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఉద్యోగాలు వచ్చాయి. వీరిద్దరూ బ్లాక్ చైన్ టెక్నాలజీలో స్పెషలైజేషన్ చేయడంతో బ్లాక్ చైన్ అప్లికేషన్స్ లీడ్ డెవలపర్స్‌గా ఎంపికయ్యారు. ఈ విజయాలపై ఇక్ఫాయ్టెక్ డైరెక్టర్ ఎంఎస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.













