అంబేడ్కర్ ఆశయం నెరవేరలేదు.. ప్రకాశ్ అంబేడ్కర్
సమాజంలో మార్పుకోసం సంఘర్షణ తప్పదని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనువడు ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రకాశ్ అంబేడ్కర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆదర్శాలు పాటించడమే నిజమైన నివాళి. సమాజంలో మార్పుకోసం అంబేడ్కర్ భావజాలం ఎంతో అవసరం. దీనికోసం సంఘర్షణ తప్పదు. ఆంగ్లేయులు భారత్‌ను ఎలా దోచుకుంటున్నారో ఆయన గ్రహించారు. రూపాయి బలోపేతం ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. దళితబంధు పథకం రూపొందించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు.
అంబేడ్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. అంటరానితనాన్ని పారద్రోలడానికి అంబేడ్కర్ ఎంతో కృషి చేశారు. కొన్ని అతి చిన్న కులాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఆంద్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఆనాడు పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసే వరకు సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణ కోసం కూడా ఎంతో పోరాటం జరిగింది. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేడ్కర్ మద్దతిచ్చారు. దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అంబేడ్కర్ తెలిపారు. రెండో రాజధానిగా హైదరాబాద్ సరైందని సూచించారు. పాక్, చైనా నుంచి హైదరాబాద్ ఎంతో దూరంలో ఉంది అని అన్నారు.













