హైదరాబాద్‌లో మళ్లీ నుమాయిష్ సందడి!
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గతేడాది నుమాయిష్‌ను నిలిపివేశారు. అయితే ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో నుమాయిష్‌ను నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి జీ ప్రభాశంకర్ పేర్కొన్నారు.
ప్రతి ఏడాది నుమాయిష్‌ను జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తుంటారు. నుమాయిష్‌లో దాదాపు 2,500 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది తక్కువ సంఖ్యలో స్టాళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కరోనా దృష్ట్యా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే వచ్చే స్టాళ్లకు అనుమతి నిరాకరించనున్నారు. నుమాయిష్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.15 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.













