వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం..
హైదరాబాద్ నగరంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరం మొత్తం జలమయం అయింది. హైదరాబాద్ సిటీలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షపాతం నమోదైంది. మంగళవారం ఒకేరోజు భాగ్యనగరంలో గరిష్టంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. గత వందేళ్లలో ఇంత అత్యధిక వర్షపాతం నమోదవడం ఇది రెండోసారి అంటున్నారు. హైదరాబాద్‌తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడ? ఎంత? వర్షపాతం నమోదైందో పరిశీలిస్తే.. ఘట్కేసర్-32 సెంటీమీటర్లు, హయత్‌నగర్ 29.8, హస్తినాపురం 28.4, సరూర్‌నగర్ 27.3, అబ్దుల్లాపూర్‌మెట్ 26.6, కీసర 26.3, ఇబ్రహీంపట్నం 25.7, ఉస్మానియా యూనివర్సిటీ 25.6, ఉప్పల్ 25.6, మేడిపల్లి 24.2, కందికల్‌గేట్ 23.9, రామంతాపూర్ 23.2, బేగంపేట్ 23.2, మల్కాజ్గిరి 22.6, అల్వాల్ 22.1, ఆసిఫ్‌నగర్, సైదాబాద్‌లో 20, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.













