ట్విటర్‍కు షాక్‍ల మీద షాక్‍లు

ట్విటర్‍కు షాక్‍ల మీద షాక్‍లు తగులుతున్నాయి. ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి కేంద్రం నోటీసులు ఇవ్వగా, తాజాగా హైదరాబాద్ పోలీసులు ట్విటర్‍కు నోటీసులు జారీ చేశారు. ఫేస్ వీడియో సర్క్యులేట్ కేసులో నోటీసులు పంపినట్లు హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి మీరాచోప్రా ఫిర్యాదుపై ట్విట్టర్ వెంటనే స్పందించాలంటూ నోటీసులు పంపినట్లు సమాచారం. వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్‍లోని ఘజియాబాద్‍లో కూడా థర్డ్ పార్టీకి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆరోపిచారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ట్విటర్ తొలగించలేదని ఎఫ్‍ఐఆర్‍లో పేర్కొన్నారు.