కోటి మొక్కలు లక్ష్యానికి చేరువగా…
మహానగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్ఛదనాన్ని పెంపొందించేందుకు జిహెచ్ఎంసి హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటడమే గాక, వాటి పరిరక్షణ భేష్‌గా ఉందని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి కితాబునిచ్చారు. బుధవారం ఆయన శివార్లలోని బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకున్న ప్రధాన నిమజ్జన ఊరేగింపు రూట్‌ను పరిశీలించారు. తొలుత వారిద్దరు కలిసి బాలాపూర్ వినాయకుడ్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత మార్గమధ్యలోని డిఆర్డిఎల్ ఆవరణలో 7800 మొక్కలు నాటగా, వీటిలో 98శాతం మొక్కలు మనుగడ సాగించి, ఏపుగా పెరగటం పట్ల పోలీసు కమిషనర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జిహెచ్ఎంసి అర్బన్ బయోడైవర్శిటీ నిర్వహిస్తున్న రిజిస్టర్లో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో వివిధ శాఖల మధ్య సమన్వయంతో కోటి మొక్కలు హైదరాబాద్ నగరంలో నాటాలనే లక్ష్యానికి చేరువగా ఉన్నామని, ఇప్పటి వరకు 53లక్షల 50వేల మొక్కలను నాటినట్లు తెలిపారు.













