అమరావతికి సంఫీుభావం తెలిపిన హైదరాబాదీలు
రాజధాని అమరావతి ఆంధ్రుల హక్కు అనే నినాదంతో హైదరాబాద్లోని నిజాంపేటలోని వెంకటసాయి ఎంక్లేవ్లో హైదరాబాద్ వాసులు అమారావతి ఐక్య కార్యచరణ సమితికి సంఫీుభావం తెలిపారు. ఆదివారం నిర్వహించిన సమావేశానికి అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు చిట్టిబాబు, నాగలక్ష్మీతో పాటు పలువురు రైతులు హాజరయ్యారు. అమరావతి కోసం మహిళలు, రైతులు 54 రోజులగా రోడ్ల మీద దీక్షలు చేస్తుంటే పట్టించుకోని జగన్ ప్రభుత్వం ఎందుకు అని ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణకు హైదరాబాదీ సంఫీుభావం తమకు మరింత బలాన్నిస్తోందని జేఏసీ నేతలు చెప్పారు. నిర్వహకులు ప్రవీన్, కిరణ్, సురేష్, ఫణిను అభినందించారు.













