గుడ్ న్యూస్… ఓఆర్ఆర్ పై మరింత వేగంతో
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీద స్వీడ్ లిమిట్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ గంటకు 100 కి మీ ఉండగా దానికి 120కి పెంచాలని నిర్ణయించింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచుతున్న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం గంటకు 100 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, దీనిని 120 కి.మీకి పెంచుతున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్పై ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే స్పీడ్ లిమిట్ పెంచిన నేపథ్యంలో వాహనాదారులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ మేరకు పురపాలక, ఓఆర్ఆర్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించిన అనంతరం అర్వింద్ కుమార్ ఈ ప్రకటన చేశారు.













