బీజేపీ నేత సంచలన ప్రకటన.. హైదరాబాద్ పేరు మార్చి తీరతాం
బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చి తీరతామని ప్రకటించారు. భారత్ నీతి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ హిందూ కాంక్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పేరు మార్చే విషయంలో తమను ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. కేవలం పేరు మార్పే తమ ఉద్దేశం కాదని, సైద్ధాంతిక మార్పు కూడా తమ ఉద్దేశమన్నారు. దీనిపై ప్రజల్లో కూడా మద్దతు కూడగడతామన్నారు. అవగాహన కలిగిస్తామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని మేధావులు అభిప్రాయ పడుతున్నారని, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.













