మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్థరాత్రి 12:15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని తెలిపారు. చివరి మెట్రోరైళ్లు 12:15 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని చెప్పారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది పోలీసుల నిఘా ఉంటుందన్నారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.













