హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం…సమయాల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. చివరి స్టేషన్ నుంచి రాత్రి 7:45 గంటల వరకు చివరి మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది. రాత్రి 8:45 గంటలకు చివరి స్టేషన్కు మెట్రో రైలు చేరుకోనుంది. ఈ మార్పులు నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. ఉదయం 6:30 గంటల నుంచి మొదటి రైలు యథావిధిగా అందుబాటులో ఉండనుంది. ప్రయాణికులు మాస్కులు, శానిటైజర్లు వాడాలని మెట్రో అధికారులు సూచించారు.













