మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్…
మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ వేళ్లలో మార్పులు చేసింది. రేపటి నుంచి (నవంబర్ 10) నుంచే ఉదయం 6 గంటలకు తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది. అలాగే రాత్రి 10:15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయలుదేరి రాత్రి 11:15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. మెట్రో సేవలు పొడిగించాలని మంత్రి కేటీఆర్‌ను ఓ ప్రయాణికుడు కోరడంతో దానికి మంత్రి సానుకూలంగా స్పందించి మెట్రో ఎండీ దృష్టికి తీసుకెళ్లడంతో వేళ్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.













