హైదరాబాద్ కు అరుదైన గౌరవం
భాగ్యనగరాన్ని స్వచ్ఛభారత్ మిషన్ ఉన్నత పురస్కారం వరించింది. హైదరాబాద్‌ను బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆయా వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు గాను.. ఓడీఎఫ్ ++ (ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ) గుర్తింపు జారీ చేస్తూ స్వచ్ఛభారత్ మిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ గౌరవాన్ని దక్కించుకున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. తాజాగా చండీగఢ్, ఇండోర్‌లను ఓడీఎఫ్ ++ నగరాలుగా ప్రకటించారు. మొత్తం 4,041 నగరాలు గుర్తింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, వికారాబాద్ నగరాలున్నాయని బల్దియా అధికారులు తెలిపారు.













