హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు
హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటోంది. ఊహించని విధంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం ఇప్పటికే పలు రంగాల్లో స్థానం సుస్థిరం చేసుకుంది. ఐక్యరాజ్య సమితి స్టాటిస్టికల్ విభాగం (యుఎన్ఎస్ఎస్) ఇదివరకు నిర్వహించిన సర్వేలో బెస్ట్ లివింగ్ సిటీగా, ఇన్వెస్ట్మెంట్ విభాగంలో సేఫెస్ట్ సిటీగా ప్రతిష్టను దక్కించుకున్న మన హైదరాబాద్ మహానగరం తాజాగా భద్రత అంశంలోనే దశలో రెండవ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నరానికి అరుదైన గుర్తింపు దక్కింది. విశ్వసనగరం వైపు విస్తరిస్తున్న హైదరాబాద్ చాలా భద్రమని యూఎస్ స్టాటిస్టికల్ సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో శాంతి భద్రతల పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని సర్వేలో వెల్లడైంది.













