రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు.. సమయ పాలనలో
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు పొందింది. అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంను కైవసం చేసుకుంది. 2023లో ఓటీపిని సమీక్షించిన విమానయాన అనలిటిక్స్ సంస్థ సిరియమ్ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. టాప్-10 విమానాశ్రయాల్లో మన దేశంలోని కోల్‌కతా విమానాశ్రయం కూడా స్ధానం దక్కించుకుంది. అమెరికాలో ని మిన్నేపొలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం 84.44శాతం ఓటీపీతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్) 84.42శాతం ఓటీపీతో రెండో స్థానంలో నిలవగా, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ( బెంగళూరు) 84.08 శాతం ఓటీపీతో మూడో స్థానంలో నిలిచింది. పెద్ద విమానాశ్రయాల్లోనూ ఈ 2 ఘనంగా నిలిచాయి. మధ్య స్థాయి విమానాశ్రయాల విభాగంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ విమానాశ్రయం ( కోల్‌కతా) 83.91 శాతం ఓటీపీతో 9వ స్థానం దక్కించుకుంది.













