శంషాబాద్ విమానాశ్రయానికి.. మరో గుర్తింపు

శంషాబాద్‍లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి గ్రీన్ ఎయిర్ పోర్టస్ గుర్తింపు లభించింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‍పోర్టు లిమిటెడ్ (జీహెచ్‍ఐఎఎల్)కు ప్రతిష్టాత్మక ఎయిర్ పోర్టస్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్ పోర్టస్ రికగ్నేజేషన్ 2021 విభాగం కింద ఏడాదికి 25 మిలియన్ ప్రయాణికులు కేటగిరిలో గోల్డ్ రికగ్నెజేషన్ దక్కింది. సమర్థవంతమైన ఎయిర్‍క్యాలిటీ మేనేజ్‍మెంట్‍కు గాను గ్లోబల్ ప్యానెల్ ఈ అవార్డును ప్రకటించింది. జీహెచ్‍ఐ ఎఎల్ ఈ అవార్డును అందుకోవడం వరుసగా ఇది నాలుగవసారి విశేషం. ఏసీఐ గ్రీన్‍ఎయిర్‍పోర్టస్ రికగ్నెజేషన్ కార్యక్రమం పర్యావరణంపై విమానాయన పరిశ్రమ ప్రభావాన్ని తగ్గించడానికి, అదే విధంగా అత్యుత్తమ పర్యావరణ కార్యక్రమాలు, పర్యావరణ ఉత్తమ పద్ధతులను ప్రోత్సహిస్తుంది.