జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ కు మరో అవార్డు
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అవార్డును సొంతం చేసుకుంది. 2021కి గాను ప్రపంచ స్థాయిలో ఇచ్చే సైట్రాక్స్ అవార్డును దక్కించుకుంది. వరుసగా 3 సార్లు ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. దీంతో పాటు ప్రపంచ స్థాయిలో నిర్ధారించే టాప్-100 విమానాశ్రయాల్లో 64వ స్థానంలో నిలిచిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికుల సంతృప్తిని కొలమానంగా చేసుకొని స్కైట్రాక్స్ అవార్డులిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 550 విమానాశ్రయాల్లోని ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటిస్తుంది. కోవిడ్ పరిస్థితుల్లోనూ మెరుగైన సేవలందించడంతోనే ఈ అవార్డు దక్కిందని గెయిల్ సీఈవో ప్రదీప్ చెప్పారు.













