గంటలో పాస్‌పోర్టు.. సరికొత్త రికార్డు
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం గంట వ్యవధిలోనే పాస్‌పోర్టును జారీ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తొమ్మిది రోజుల శిశువుకు తప్పనిసరి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు ధ్రువీకరించడంతో చికిత్స నిమిత్తం లండన్ వెళ్లాల్సి వచ్చిది. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్ పాస్‌పోర్ట్ కేంద్రం అధికారులను సంప్రదించడంతో వెంటనే స్పందించిన కార్యాలయ అధికారులు అక్కడికక్కడే దరఖాస్తును ప్రాసెస్ చేసి తదుపరి చర్యలు తీసుకుని కేవలం గంట వ్యవధిలోనే పాస్‌పోర్టు జారీ చేసినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. తమ కార్యాలయ ఉద్యోగులు విధి నిర్వహణ పట్ల చూపిన అంకితభావం ఫలితంం గానే గంటలోనే పాస్‌పోర్ట్ జారీ చేసి బాధితురాలికి అందించినట్లు తెలిపారు.













