హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠకు తెరలేపుతున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 30న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలించనున్నారు. అక్టోబర్ 13న నామినేష్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఫలితాలను వెల్లడిరచనున్నారు. కాగా తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరప్ చేయడంతో.. తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.













