మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే మేడారం జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్‌కుమార్ ఆదేశించారు. జాతర ఏర్పాట్లు, భద్రతపై సీఎస్ సోమేష్ కుమార్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సంద్భంగా సీఎస్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని తెలిపారు. జాతరకు హాజరయ్యే వారికి ఏ విధమైన ఇబ్బందులు రావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయూలని నిర్ణయించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 19 వరకు జాతర జరుగుతుందన్నారు. భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జంపన్న వాగులోకి నీటిని విడుదల చేశామన్నారు. దేవాదాయ ఇంజనీరింగ్ విభాగాల పనులన్నీ దాదాపుగా పూర్తి కావొచ్చాయని పేర్కొన్నారు.