తెలంగాణ హెచ్ఆర్ఏటీఎస్ నూతన కార్యవర్గం
హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణా స్టేట్ (హెచ్ఆర్ఏటీఎస్) నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని 2021-2023 సంవత్సరాలకు గానూ ఎన్నుకున్నది. రాష్ట్రంలోని స్టార్ హోటల్స్, ప్రీమియం స్టాండలోన్ రెస్టారెంట్లు, పబ్స్, అతిథ్య రంగ సంస్థలు సభ్యులుగా ఉన్నారు. అతిథ్యరంగ పరిశ్రమలో 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఇయాన్, దేశీయంగా, అంతర్జాతీయంగా , దక్షిణాసియాలో అతి పెద్ద అతిథ్య రంగ సంస్థ అయిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్)ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్లుగా హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ జనరల్ మేనేజర్ మనీశ్, ది వెస్ట్రరన్ హైదరాబాద్ మైండ్ స్పేస్ జనరల్ మేనేజర్ పరాగ్, రాడిసన్ బ్లూ ప్లాజా జనరల్ మేనేజర్ సందీప్ జోషి, లేమన్ ట్రీ జీఎం రెజినాల్డ్ కార్బోట్ జనరల్ సెక్రెటరీగా ఎన్నుకున్నారు. జాయింట్ సెక్రెటరీ, ట్రెజరర్‌గా దస్పల్లా హోటల్ రోహిత్, ఈసీ మెంబర్లుగా వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ హోటల్స్ జీఎం శైలేష్ మత్నూర్, హాస్పిటాలిటీ కన్సల్టెంట్ ప్రదీప్‌ను ఎన్నుకున్నట్లు కమిటీ పేర్కొన్నది.













