తెలంగాణలో విపక్షనేతల అరెస్టు…
ఇంటర్మీడియెట్ బోర్డ్ నిర్లక్ష్యం కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ, విపక్ష నేతలు ఇంటర్మీడియెట్ బోర్డ్ ముట్టడికి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు విపక్ష నాయకులను ముందస్తుగానే అరెస్టులు చేయడంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం భగ్గుమన్నారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని అణచలేరని, ఎవరెన్ని అడ్డంకులు సష్టించినా కూడా ఇంటర్ బోర్డు ముందు ఆందోళన చేసి తీరుతామన్నారు. గత అర్థరాత్రి నుంచి ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని, అనేక జిల్లాల్లో ధర్నాకు వస్తారనుకునే విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.













