కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోంమంత్రి
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. ఆయనతో పాటు తన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం మంత్రికి కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కరోనా బారినపడిన ఆయన కుటుంబ సభ్యులు కూడా కోలుకొని ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. మేం త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆయన సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.













