తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ పర్యటన ఖరారు
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మూడు క్లస్టర్ సమావేశాల్లో పాల్గొంటారు. ఇందులో కరీంనగర్, మహబూబ్‌నగర్‌తో పాటు మరో ప్రాంతానికి అమిత్ షా వస్తారని బీజేపీ వర్గాలు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతే లక్ష్యంగా అగ్రనేతలతో బీజేపీ దేశవ్యాప్తంగా క్లస్టర్ సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్ని ఐదు క్లస్టర్లుగా విభజించింది. ఒక్కో దాంట్లో మూడు నుంచి నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. బహిరంగ సభలు కాకుండా పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఎన్నికల నిర్వహణ కమిటీలు, అదేవిధంగా మేధావులు, కులసంఘాలతో ఇలా వేర్వేరు రకాలుగా క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలని కమలదళం నిర్ణయించింది.













