తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారు.. ఒకే రోజు మూడు జిల్లాల్లో
తెలంగాణలో ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి నేరుగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యగా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 3:55 గంటలకు కరీంనగర్‌కు వెళ్లి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకుంటారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆపై బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7:45 గంటలకు బయల్దేరి ఢిల్లీకి వెళ్తారు.













